కుమురం భీం ఆసిఫాబాద్ బాలేశ్వర ఆలయంలో రథోత్సవం కన్నుల పండువగా జరగనుంది. భక్తులు భారీ సంఖ్యలో రథోత్సవంలో పాల్గొననున్నారు. గోండు రాజుల పాలనలో ఆరాధ్యదైవంగా ఖ్యాతికెక్కిన బాలేశ్వరుడి ఆలయ చరిత్రను ఈ ప్రాంత ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. అమితమైన భక్తితో నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ఆలయానికి జిల్లాలోని ప్రజలే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు.
నేడు బాలేశ్వర రథోత్సవం
రథసప్తమి సందర్భంగా కొమురంభీం ఆసిఫాబాద్ పెద్ద వాగు ఒడ్డున ఉన్న బాలేశ్వర ఆలయంలో నేడు రథోత్సవం జరగనుంది. రథోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
నేడు బాలేశ్వర రథోత్సవం