కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పురపాలక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు బల్దియా అధికారులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఒకవైపు ఓటరు సవరణ చేస్తూనే మరోవైపు మిగతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు పట్టణంలోని ఎస్‌కేఈ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
కాగజ్‌నగర్ మున్సిపల్ ఎన్నికలకు బల్దియా ఏర్పాట్లు - కాగజ్‌నగర్ మున్సిపల్ ఎన్నికలకు బల్దియా ఏర్పాట్లు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పురపాలక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు బల్దియా అధికారులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
కాగజ్‌నగర్ మున్సిపల్ ఎన్నికలకు బల్దియా ఏర్పాట్లు
జిల్లా కేంద్రం నుంచి బ్యాలెట్ బాక్సులను తెప్పించి స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. కాగజ్‌నగర్ పురపాలక సంఘంలో 30 వార్డులకు ఎన్నికలు నిర్వహించనుండగా... మొత్తం 68 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బూత్‌లో రెండు బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయనుండగా మొత్తం 148 బ్యాలెట్ బాక్సులను అధికారులు తెప్పించారు.
ఇవీ చూడండి: చిరుజల్లు పలకరించింది... నగరం మురిసిపోయింది!