దోమలు లేని సమాజాన్ని నిర్మించుకోవాలని సూచిస్తూ.. కుమురం భీం జిల్లా సిర్పూర్ టౌన్లో ఆరోగ్య శాఖ, పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. డెంగ్యూ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్థానికులకు వివరించారు. చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్య శాఖ సిబ్బంది సూచించారు.
'దోమలు లేని సమాజాన్ని నిర్మించుకోవాలి' - awareness program on national dengue day
జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా కుమురం భీం జిల్లా సిర్పూర్ టౌన్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ వ్యాధి రాకుండా కాపాడుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.
జాతీయ డెంగ్యూ దినోత్సవంపై అవగాహన ర్యాలీ
పరిసరాలు శుభ్రంగా లేకపోతే మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, మెదడువాపు, బోదకాలు లాంటి వ్యాధులు వస్తాయని పేర్కొన్నారు. వ్యాధిగ్రస్థుల నుంచి ఆరోగ్యవంతులకు ఆ జబ్బులు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు.
ఇదీ చదవండి:సరఫరా ఆగొద్దు.. ముప్పు కలగొద్దు