ఈ నెల 27న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ నుంచి బీసీ విద్యార్థుల మేల్కొలుపు యాత్రను ప్రారంభిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ ఓయూ గెస్ట్‌హౌస్‌లో యాత్ర గోడ పత్రికను విడుదల చేశారు. 33 జిల్లాలో 66 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందన్నారు.
'ఈనెల 27 నుంచి బీసీ విద్యార్థుల మేల్కొలుపు యాత్ర' - jajula srinivas goud today news latest news
అజ్ఞానాంధకారాన్ని విద్యాతోనే తొలగించి... వివేకంతోనే ముందుకు సాగుదామన్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే మేల్కొలుపు యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.
Awakening of BC students yatra start from November 27
ఫిబ్రవరి 3న కాకతీయ యూనివర్సిటీలో ముగింపు సభ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. లక్షలాది మంది విద్యార్థులను యాత్రలో భాగస్వామ్యం చేస్తామన్నారు. మేధావులు, ఉద్యోగులు, బీసీ సంఘాలు కలసి రావాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.