తెలంగాణ

telangana

ETV Bharat / state

మావోయిస్టుల మృతదేహాలకు శవపరీక్ష... అనంతరం కుటుంబసభ్యులకు అప్పగింత - maoists encounter

కడంబ అటవీప్రాంతంలో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు సిర్పూర్​ (టి) మండలంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.

Autopsy on Maoist bodies in kumurambheem asifabad district
మావోయిస్టుల మృతదేహాలకు శవపరీక్ష... అనంతరం కుటుంబసభ్యులకు అప్పగింత

By

Published : Sep 20, 2020, 9:43 PM IST

శనివారం రాత్రి కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ మండలం కడంబ అటవీప్రాంతంలో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు సిర్పూర్​ (టి) మండలంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు సిద్ధం చేశారు.
ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండకు చెందిన మావోయిస్టు బాజిరావు మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. చత్తీస్​గఢ్​ బీజాపూర్​కు చెందిన మరో మావోయిస్టు చుక్కాలు మృతదేహం కోసం కుటుంబసభ్యులు ఎవరూ రాలేదు. చుక్కాలు మృతదేహాన్ని సిర్పూర్ సామాజిక ఆసుపత్రిలోని మార్చురీలో మూడు రోజులపాటు ఉంచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈలోపు ఎవరైనా వస్తే వారికి అప్పగిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details