కుమురం భీం జిల్లా సిర్పూర్ టీ మండలం వెంపల్లి సమీపంలో ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు కాగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఆరుగురు ఉపాధ్యాయులున్నారు. సిర్పూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో పని చేస్తున్న ఆరుగురు ఊపాధ్యాయులు మరో ఆరుగురు సాధారణ ప్రయాణికులతో కలిసి కాగజ్ నగర్ వచ్చేందుకు ఆటో ఎక్కారు. వెంపల్లి వద్దకు రాగానే ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది.
ఆటో బోల్తా... ప్రయాణికులు సురక్షితం - accident
అదుపు తప్పి ఆటో బోల్తా పడిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వెంపల్లి సమీపంలో జరిగింది. ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.
బోల్తా పడిన ఆటో
ఇవీ చూడండి: గూగుల్ డూడుల్ పోటీలో గెలిస్తే రూ.5 లక్షలు