కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో ప్రభుత్వ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూములను అక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవలి కాలంలో కాగజ్ నగర్ మండలం బోరిగాం, చారిగాం శివారులోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు.
ఈమేరకు సరైన పత్రాలు లేని నిర్మాణాలు గుర్తించి తొలగించారు. ప్రభుత్వ భూములలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టినవారికి తొలగించాలంటూ పలుమార్లు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ నిర్మాణాలు కొనసాగుతుండటం వల్ల అధికారులు తెల్లవారుజామున జేసీబీలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు నడుమ నిర్మాణాలను కూల్చివేశారు. కూల్చివేత సమయంలో పోలీసులు ఎవరిని అనుమతించలేదు.