కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో ఎఫ్ఆర్ఓ అనితపై ఎమ్మెల్యే కోనేరు కొనప్ప సోదరుడు కృష్ణ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అధికారులు విధులు నిర్వహిస్తున్న సమయంలో తెరాస నాయకులు కర్రలతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడడం దారుణమని స్పష్టం చేశారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న తెరాస నాయకులు ప్రభుత్వాధికారులపై దాడులకు పాల్పడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు అటవీశాఖ అధికారులకు ప్రభుత్వం ఆయుధాలు సమకూర్చాలని సూచించారు. ఇలాంటి దాడులు తిరిగి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అధికారిణిపై దాడికి కోమటిరెడ్డి ఖండన - MLA KONERU KONAPPA
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ అటవీ అధికారిణిపై చేసిన దాడిని భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
మరోసారి ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి : ఎంపీ వెంకట్ రెడ్డి