భూ వివాదంలో ఆర్మీ జవాను కుటుంబంపై ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరు దాడి చేయగా ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. ఈ ఘటన కుమురం భీం జిల్లా కౌటాల మండలం ముత్యంపేటలో జరిగింది.
జవాను కుటంబంపై దాడి.. భూవివాదమే కారణం - కుమురం భీం జిల్లా ముత్యంకుంట సమాచారం
భూవివాదం కారణంగా ఆర్మీ జవాను తల్లిపై కొందరు దాడి చేసిన ఘటన కుమురం భీం జిల్లాలో జరిగింది. ఈ దాడిలో ఆమె చేతికి గాయాలయ్యాయి.
ముత్యంపేట గ్రామానికి చెందిన గాదిరెడ్డి శ్రీనివాస్ భారత సైన్యంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తల్లి నాగమ్మ, భార్య స్వగ్రామంలో ఉంటున్నారు. గత కొంతకాలంగా వారి నివాస స్థలానికి సంబంధించి వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో శ్రీనివాస్ తల్లి నాగమ్మ సదురు భూమిలో గృహ నిర్మాణం చేపడుతుండగా ప్రత్యర్థి వర్గం సభ్యులు అడ్డుకున్నారు. చివరకు వివాదం పెద్దదై ఆమెపై దాడి చేయడంతో నాగమ్మ చేతికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:ఈనెల 7న తెరాస కార్యవర్గ సమావేశం... ఈ అంశాలపైనే చర్చ!