తెలంగాణ

telangana

ETV Bharat / state

కాగజ్​నగర్​లో లాక్​డౌన్​ అమలును పరిశీలించిన అదనపు ఎస్పీ - కాగజ్​నగర్​లో లాక్​డౌన్​

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో లాక్​డౌన్ అమలును అదనపు ఎస్పీ వైవీ సుధీంద్ర పరిశీలించారు. అనవసరంగా బయటకు వస్తే వాహనాలు సీజ్​ చేస్తామని హెచ్చరించారు.

Telangana news
కుమురంభీం జిల్లాలో లాక్​డౌన్​

By

Published : May 20, 2021, 1:47 PM IST

కుమురంభీం జిల్లాలో పోలీసులు లాక్​డౌన్​ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. కాగజ్ నగర్ పట్టణంలో లాక్​డౌన్​ తీరును జిల్లా అదనపు ఎస్పీ పరిశీలించారు. పలు కూడళ్లలో వాహన తనిఖీలు పర్యవేక్షించారు. పలువురికి జరిమానా విధించారు.

అత్యవసర పనుల పేరుతో పలుమార్లు రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 6 నుంచి 10 గంటలలోగా పనులన్నీ చూసుకుని వెళ్లిపోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:పకడ్బందీగా లాక్​డౌన్.. ఉల్లంఘించిన వారిపై చర్యలు

ABOUT THE AUTHOR

...view details