తెలంగాణ

telangana

ETV Bharat / state

పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న జడ్పీ ఛైర్​పర్సన్

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గణేశ్​పూర్​ గ్రామంలో పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజల ఫిర్యాదుతో జడ్పీ ఛైర్​పర్సన్ కోవా లక్ష్మీ రంగంలోకి దిగారు.

By

Published : Sep 17, 2020, 1:09 PM IST

asifabad zilla parishad chair person interrupted animals smuggling
పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న జడ్పీ ఛైర్​పర్సన్

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గణేశ్​పూర్​ గ్రామంలో కొనసాగుతున్న పశువుల అక్రమ రవాణా గురించి అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు అక్రమార్కులు పశువులను కర్కశంగా కబేళాలకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికుల ఫిర్యాదుకు స్పందించిన ఆసిఫాబాద్ జడ్పీ ఛైర్​పర్సన్ కోవా లక్ష్మి.. వాంకిడి మండలం గణేశ్​పూర్​ గ్రామం వద్ద పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్నారు. పశువులను, వాటిని తరలిస్తున్న వాహనాలను పోలీసులకు అప్పగించారు. ఆసిఫాబాద్​ నుంచి అక్రమంగా పశువులను హైదరాబాద్​కు తరలిస్తుంటే.. చెక్​పోస్టుల వద్ద ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారని కోవా లక్ష్మీ అధికారులను నిలదీశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details