కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొత్త సారసాల గ్రామంలో జరిగిన గొడవపై ఎస్పీ మల్లారెడ్డి స్పందించారు. ఉదయం 8 గంటల సమయంలో సార్సాలా గ్రామంలో ప్రభుత్వం ఉత్వర్వుల మేరకు చెట్లు నాటేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులపై రైతులు దాడి చేశారని వెల్లడించారు. ఈ ఘటనలో ప్రధాన పాత్రదారులైన కోనేరు కృష్ణారావు, అతని అనుచరుడు బూర పోషంను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై హత్యాయత్నం, వాహనాల ధ్వంసం కింద కేసులు నమోదు చేశామన్నారు. ఈ ఘటనలో నిందితులకు తప్పనిసరిగా కఠిన శిక్షలు అమలయ్యేలా చూస్తామని ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు.
'నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం'
అటవీశాఖ అధికారి అనితపై దాడి చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆసిఫాబాద్ ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. తప్పు ఎవరు చేసిన కఠిన శిక్షలు పడేలా చూస్తామన్నారు.
'నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం'