కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం తాటిగూడ గ్రామంలో ఆదివాసీలు దండారి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కు హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆదీవాసీలతో కలిసి గుస్సాడీ నృత్యాలు చేశారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూనే ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఎమ్మెల్యే ఆత్రం సక్కు గుస్సాడీ నృత్యాలు - dandari vedukalu
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తాడిగూడలో ఆదివాసీలు దండారి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే ఆత్రం సక్కు ముఖ్యఅతిథిగా హాజరై ఆదీవాసీలతో కలిసి నృత్యం చేసి అందరిని అలరించారు.
ఎమ్మెల్యే ఆత్రం సక్కు గుస్సాడీ నృత్యాలు