కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు జనవరి 14న తీసుకున్న 'జై జంగో జై లింగో' దీక్షను నేడు పూర్తి చేశారు. జిల్లాలో ఆదివాసీలు నెల రోజుల నుంచి ఈ దీక్షను చేస్తున్నారు. వీరితో పాటు ఎమ్మెల్యే కూడా దీక్షకు పూనుకున్నారు. జనవరి 14 నుంచి ఈ రోజు వరకు కొనసాగించారు.
ఈ దీక్షలో ఒక పూట భోజనం చేస్తూ.. సాయంత్రం పాలు, పండ్లను తీసుకుంటారు. ఇలా చేస్తే కోరిన కోరికలు తీరుతాయని.. అనుకున్న పనులు జరుగుతాయని వారి నమ్మకం. నేడు చివరి రోజు కావడం వల్ల ఆసిఫాబాద్‌లోని రవిచంద్ర కాలనీలో ఉన్న పహాడ్కూపర్ లింగో ఆలయానికి ఎమ్మెల్యే ఆత్రం సక్కు సతీసమేతంగా వెళ్లారు.