వేతనాల కోసం ఆశాల ధర్నా.... - ధర్నా
కనీస వేతనం చెల్లించాలంటూ ఆశా కార్యకర్తలు నిరసన చేపట్టారు. నిర్మల్, ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాకు దిగారు. జీతం 18 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
ఆశా కార్యకర్తలు నిరసన
ఇటు కొమురం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ధర్నా చేశారు. గత ఐదు నెలల బకాయిలను త్వరగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల విధులకు సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వలేదని వాపోయారు.
రావాల్సిన వేతనాలు వెంటనే చెల్లించాలని లేని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆశాలు హెచ్చరించారు.