తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆసిఫాబాద్‌లోని మహిళా శిశు సంక్షేమ అధికారి కార్యాలయం ముందు అంగన్వాడీలు ధర్నా చేశారు. పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం చెల్లించి... ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఆసిఫాబాద్, వాంకిడి, జైనూర్ ప్రాజెక్టులలో కోత విధించిన తొమ్మిది రోజుల వర్తమానాన్ని ఇవ్వాలన్నారు. అర్హత కలిగిన వారికి బదిలీలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు సబ్సిడీ గ్యాస్‌లను పంపిణీ చేయాలన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అంగన్వాడీలు హెచ్చరించారు.
'అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి...' - ANGANVADI VOLUNTEERS PROTESTED FOR THEIR SALARIES
ఆసిఫాబాద్‌లోని మహిళా శిశు సంక్షేమ అధికారి కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ANGANVADI VOLUNTEERS PROTESTED FOR THEIR SALARIES