మహారాష్ట్ర రాజుర తాలూకా దేవాడ గ్రామపంచాయతీ పరిధిలో అంతరాష్ట్ర రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో సిద్ధేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం పురాతన కాలం నాటిదని ప్రసిద్ధి. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఆలయం ఉన్నట్టు రెండేళ్ల క్రితం తెలిసిందని స్థానికులు పేర్కొన్నారు. అప్పటి నుంచి ప్రజలు మహా శివరాత్రి రోజున వెళ్లి పూజలు నిర్వహిస్తున్నారు.
అడవిలో పురాతన ఆలయం.. మహాశివరాత్రి రోజు ప్రత్యేక పూజలు
మహారాష్ట్ర రాజుర తాలూకా దేవాడ గ్రామపంచాయతీ పరిధిలో అంతరాష్ట్ర రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఓ పురాతన కాలం నాటి ఆలయం ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఆలయం ఉన్నట్టు రెండేళ్ల క్రితం తెలిసిందని స్థానికులు పేర్కొన్నారు. అప్పటినుంచి మహా శివరాత్రి రోజున వెళ్లి పూజలు నిర్వహిస్తున్నారు.
అభివృద్ధికి నోచుకోని ఆలయం.. భక్తుల రద్దీ
ఈ సిద్ధేశ్వర ఆలయం లోపల ఓ బావి ఉందని.. ఆ బావికి ఆలయం లోపల నుంచి మెట్ల ద్వారా పోవచ్చని పలువురు భక్తులు తెలిపారు. ఆ బావిలో మూడు కాలాల పాటు ఒకే రీతిలో నీళ్లు ఉంటాయని అన్నారు. ఇంత ప్రశస్తి ఉన్న ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి :రాణి రుద్రమ నిర్మించిన శివకేశవాలయంలో ఘనంగా శివరాత్రి వైభవం