తెలంగాణ

telangana

ETV Bharat / state

కుమురం భీం జిల్లాలో వైభవంగా తీజ్ ఉత్సవాలు - తీజ్ ఉత్సవాలు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో తీజ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తొమ్మిది రోజుల నుంచి జరిగిన ఉత్సహల్లో... గిరిజనలు ఆటపాటలతో సంతోషంగా పాల్గొన్నారు. యువతుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

కుమురం భీం జిల్లాలో వైభవంగా తీజ్ ఉత్సవాలు

By

Published : Aug 5, 2019, 12:45 PM IST

పెళ్లికానీ యువతులు తమకు మంచి పెళ్లి సంబంధాలు వస్తాయనే నమ్మకంతో తీజ్ పండుగను జరుపుకుంటారు. చేనులోని మట్టిని వెదురుతో అల్లిన బుట్టలో వేసి అందులో గోధుమలు అలికి వాటికి సాంప్రదాయబద్ధంగా అలంకరణ వస్తువులు కట్టారు. ఆ బుట్టకు ఉదయం సాయంత్రం నిత్యం పూజలు, ఉపవాస దీక్షలతో ప్రదక్షణలు చేశారు. ఆ మొక్కలు ఎదిగిన విధంగా ఇల్లు అభివృద్ధి చెంది పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని, గ్రామం సుఖశాంతులతో ఉంటుందనే నమ్మకంతో మహిళలు పూజలు నిర్వహించారు. ముందుగా సేవాలాల్ భక్తులు ఆలయంలో హోమం నిర్వహించారు. అనంతరం ఆట పాటలు.. నృత్యాలతో నిమజ్జనానికి వందలాది మంది మహిళలు బయలుదేరారు.

కుమురం భీం జిల్లాలో వైభవంగా తీజ్ ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details