తెలంగాణ

telangana

ETV Bharat / state

రంజాన్​ పర్వదినాన వెలవెలబోయిన మసీదులు - వెలవెలబోయిన కాగజ్​నగర్​ మసీదులు

లాక్​డౌన్ అమలులో ఉన్న కారణంగా రంజాన్ నాడు కూడా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​ నగర్​లోని మసీదుల వద్ద సందడి కనిపించలేదు. కేవలం ఐదారుగురు మత పెద్దల సమక్షంలోనే ప్రార్థనలు నిర్వహించారు.

all mosques are closed in kagajnagar
వెలవెలబోయిన కాగజ్​నగర్​ మసీదులు

By

Published : May 14, 2021, 6:56 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మసీదులన్నీ రంజాన్​ పర్వదినాన కూడా వెలవెలబోయాయి. కొంతమంది మతపెద్దల సమక్షంలోనే ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. మిగతా వారంతా తమతమ ఇళ్లలోనే ప్రార్థనలు చేశారు.

కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మసీదులో కేవలం ఐదుగురితో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని ఈద్గా సహా అన్ని మసీదుల వద్ద జనం గుమికూడకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.

ఇవీ చదవండి:కరోనా కోలుకున్న వారిలోనూ.. బ్లాక్ ఫంగస్

ABOUT THE AUTHOR

...view details