తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజాధనం ప్రజలకే చెందాలనేదే కాంగ్రెస్‌ విధానం : ప్రియాంక గాంధీ - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

Aicc Leader Priyanka Gandhi Public Meeting at Asifabad : ప్రజాధనం ప్రజలకే చెందాలనేదే కాంగ్రెస్‌ విధానమని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.

Priyanaka Gandhi Sabha
Priyanaka Gandhi

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2023, 3:02 PM IST

Updated : Nov 19, 2023, 3:29 PM IST

Aicc Leader Priyanka Gandhi Public Meeting at Asifabad : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఇక్కడి యువతకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ(Priyanaka Gandhi) హామీ ఇచ్చారు. అలాగే రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇచ్చి.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ(Rythu Runamafi) చేస్తామని మాటిచ్చారు. కొమురం భీం ఆసిఫాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ సభలో ఆమె పాల్గొని.. ప్రసంగించారు.

ధరణి ద్వారా రైతులను, ప్రజలను బీఆర్‌ఎస్‌ మోసం చేస్తోందని ప్రియాంక గాంధీ అన్నారు. అసలు ఆసిఫాబాద్‌ ప్రజలకు బీఆర్‌ఎస్‌ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ పేరుతో కారు పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు అప్పులు పాలవుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఇంతలా కాళేశ్వరం, దిల్లీ మద్యం స్కామ్‌పై ప్రధాని మోదీ అసలు మాట్లాడరని దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌ మేనిఫెస్టోను చూసి బీఆర్ఎస్ భయపడుతుంది : రేవంత్​ రెడ్డి

Priyanaka Gandhi Election Campaign in Telangana : బీఆర్‌ఎస్‌, బీజేపీ విధానాలకు భిన్నంగా ప్రజాధనం ప్రజలకే చెందాలనేదే కాంగ్రెస్‌ విధానమని ఆమె చెప్పారు. ప్రతి పైసా ప్రజలదే ప్రభుత్వానిది కాదని వారికే చెందుతుందన్నారు. ప్రజల ద్వారా వచ్చిన డబ్బు ప్రజలకే వాడాలని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనుల్లో తప్పిదం ఉంటే కచ్చితంగా ప్రజలు నిలదీయాలని ప్రియాంక గాంధీ హితవు పలికారు.

దేశవ్యాప్తంగా కేవలం కాంగ్రెస్‌ నేతలపైనే ఈడీ, సీబీఐ విచారణ జరుగుతాయని ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే.. రెండుసార్లు నమ్మి బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే 10 ఏళ్లు వెనక్కి పంపారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజలకు జవాబుదారిగా ఉన్న నేతలను ఎన్నుకోండని ఆమె సూచించారు. ఆత్మపరిశీలన చేసుకొని ఓటు వేయాలని.. ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి రాగానే నెరవేర్చామని తెలిపారు.

"తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు గడిచిపోయాయి. పది సంవత్సరాల నుంచి కూడా కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తోంది. మీరంతా ఇక్కడ కూర్చుని ఉన్నారు. మీరందరికీ అడుగుతున్న బీఆర్‌ఎస్‌ ద్వారా మీ స్వప్నం నెరవేరిందా? ఇక్కడ ఉన్న యువకులను, అక్కచెల్లెళ్లును అడుగుతున్నాను మీకు ఉపాధి దొరికిందా? ఇక్కడ ఉన్న ప్రభుత్వం మీ పురోగతికి, మీకు ఏమైనా పనులు చేసిందా? బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ద్వారా మీ పిల్లల భవిష్యత్తు బాగుపడుతోందనే నమ్మకం మీకుందా?"- ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అగ్రనేత

Priyanaka Gandhi About Indra Gandhi : రాష్ట్రం, దేశం గురించి కేసీఆర్‌ కుటుంబం ఏమాత్రం ఆలోచించడం లేదని ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరటం లేదని.. ప్రజాస్వామ్యంలో ప్రజలను మించిన వారు లేరన్నారు. ఒకసారి ఎన్నికల్లో ఇందిరాగాంధీ కూడా ఓడిపోయారని.. తనను ఓడించినప్పుడు ప్రజలు తప్పు చేశారని ఇందిరాగాంధీ ఎప్పుడూ అనలేదని తెలిపారు.

ప్రజాధనం ప్రజలకే చెందాలనేదే కాంగ్రెస్‌ విధానం ప్రియాంక గాంధీ

ప్రజాకర్షక హామీలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో - ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి - ధరణి స్థానంలో భూమాత పోర్టల్

ఓరుగల్లు పోరులో విజయం ఎవరిది- అనుభవానిదా, యువతరానిదా?

Last Updated : Nov 19, 2023, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details