కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్నారనే రైతుల ఫిర్యాదుపై సోదాలు నిర్వహించారు. పలు దుకాణాల లైసెన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అధిక ధరలకు విక్రయాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు.
ఎరువుల దుకాణంలో వ్యవసాయ అధికారుల తనిఖీలు