కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ఈస్గాం శివమల్లన్న స్వామిని కోలామ్ ఆదివాసులు దర్శించుకున్నారు. భక్తి శ్రద్దలతో, సంప్రదాయ వాయిద్యాలతో 9 రోజులపాటు పాదయాత్ర చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ చైర్మన్ ఇందారపు రాజేశ్వర్, ఈఓ వామన్రావులు వారికి సాదర స్వాగతం పలికారు.
ఈస్గాం శివమల్లన్న సన్నిధికి కోలామ్లు - ఈస్గాం శివమల్లన్న స్వామి బోనాలు
కుమురం భీం జిల్లాలోని ఈస్గాం శివమల్లన్న స్వామిని ఆదివాసులు దర్శించుకున్నారు. స్వామివారికి మెుక్కులు చెల్లించుకోవడం కోసం అసిఫాబాద్ జిల్లా నుంచి తొమ్మిది రోజులపాటు పాదయాత్ర చేసి ఆలయానికి చేరుకున్నారు.

కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పేరొందిన ఈస్గాం శివ మల్లన్న స్వామి వారికి ప్రతియేటా మార్గశిర మాసంలో బోనాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల మండలాల ప్రజలతో పాటుగా ఆదివాసులైన కోలామ్లు కూడా హాజరవుతారు. వారు స్వామివారిని భీమన్న దేవునిగా ఆరాధిస్తారు. అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ) మండలం మాలన్గొంది గ్రామానికి చెందిన కోలామ్లు ప్రతి మూడు మూడేళ్లకు ఒకసారి పాదయాత్రగా ఈస్గాం చేరుకుని మల్లన్నస్వామిని దర్శించుకుంటారని ఆలయ సిబ్బంది తెలిపారు.
ఇదీ చదవండి: భాజపావి చిల్లర రాజకీయాలు:ఎమ్మెల్యే వినయ్ భాస్కర్