'రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి' - health emergency in telangana state
తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి నెలకొందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించలేని దుస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.
కుమురంభీం జిల్లాలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పర్యటన
ప్రజలకు కనీస ప్రాథమిక వైద్యం అందించి ప్రాణాలు కాపాడలేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వముందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు విమర్శించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో పర్యటించారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఆర్టీసీ ఆస్తులు అమ్మకపోతే తెలంగాణ ప్రభుత్వం నడిచే విధంగా లేదని, అందుకే ఆర్టీసీ ఆస్తులపై కన్నేశారని ఆరోపించారు. ఐటీడీఏ పాలక వర్గ సమావేశానికి మీడియాను అనుమతించకపోవడం సమంజసం కాదని మండిపడ్డారు.