కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలంలోని పలు గ్రామాలను ఐటీడీఏ పీఓ బవేశ్ మిశ్రా, ఎమ్మెల్యే ఆత్రం సక్కు సందర్శించారు. మండలంలోని దేవ్గూడాలో రైతులు తవ్వుకున్న బావులను పరిశీలించారు. చేనుల్లో, పొలాల్లో రైతులు తవ్వుకున్న బావులకు విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తామని బవేశ్ మిశ్రా, ఎమ్మెల్యే ఆత్రం సక్కులు హామీ ఇచ్చారు. గతంలోనే విద్యుత్ లైన్ కోసం రైతులు డీడీలు చెల్లించినట్లు తమ దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు.
Athram sakku: విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ - MLA Aatram Sakku visited Sirpur U
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలంలో రైతులు తవ్వుకున్న బావులకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తామని ఐటీడీఏ పీఓ బవేశ్ మిశ్రా, ఎమ్మెల్యే ఆత్రం సక్కులు హామీ ఇచ్చారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.

విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే
విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి బావుల వద్దకు త్రీ ఫేస్ కరెంట్ లైన్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ఆత్రం సక్కు హామీ ఇచ్చారు. రైతుల వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆర్థికంగా ఎదగాలని బవేశ్ మిశ్రా సూచించారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మండల ఏఎంసి ఛైర్మన్ ఆత్రం భగవంతరావు, వైస్ ఎంపీపీ ఆత్రం ప్రకాష్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా