సమత హత్యాచారం చేసిన నిందితుల తరఫున వాదించేందుకు ఆదిలాబాద్‌కు చెందిన సీనియర్ న్యాయవాది రహీంను ప్రత్యేక కోర్టు నియమించింది. నిందితులను పోలీసులు ప్రత్యేక బందోబస్తు మధ్య కోర్టులో హాజరుపర్చారు. న్యాయవాది గురించి కోర్టు ప్రశ్నించడంతో... తమ తరఫున రహీం వాదిస్తారని నిందితులు సమాధానమిచ్చారు. ఇదే విషయమై.. రహీంను న్యాయమూర్తి ప్రశ్నించగా... ఆయన దానికి అంగీకరించలేదు. నిందితుల తరఫున వాదించకూడదని బార్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. న్యాయస్థానం ఆదేశాలతో చివరకు నిందితుల తరఫున వాదించేందుకు అంగీకరించినట్లు రహీం పేర్కొన్నారు.
సమత నిందితుల తరఫున న్యాయవాదిని నియమించిన కోర్టు
సమత హత్యాచారం కేసు నిందితుల తరఫున వాదించడానికి ప్రత్యేకంగా న్యాయవాదిని నియమిస్తూ ఆదిలాబాద్‌లోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఆదిలాబాద్‌లోని బార్ అసోసియేషన్ తీర్మానం మేరకు నిందితుల తరఫున వాదించడానికి న్యాయవాదులెవరూ ముందుకు రాకపోవడంతో... కోర్టే న్యాయవాదిని నియమించాల్సి వచ్చింది.
samatha
నిందితుల తరఫున న్యాయవాది నియామకం తర్వాత విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. నిందితులపై నేరారోపణ అభియోగాలపై విచారించే అవకాశం ఉందని... ఆ తరువాత విచారణ కొనసాగుతుందని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. నిందితులను పోలీసులు ప్రత్యేక బందోబస్తు మధ్య జిల్లా జైలుకు తరలించారు.
ఇదీ చూడండి: "సమత కేసు నిందితులు నా పేరెందుకు చెప్పారో తెలియదు"