విధి నిర్వహణలో అసువులు బాసిన అమర జవాన్ షాకీర్ హుస్సేన్ కుటుంబ సభ్యులను కుమురం భీం జిల్లా అదనపు ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర పరామర్శించారు. కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన షాకీర్ హుస్సేన్... దేశ సరిహద్దులోని లద్దాఖ్‌లో విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలిసిందే.
జవాన్ కుటుంబాన్ని పరామర్శించిన అదనపు ఎస్పీ - Additional SP Sudhindra visited the Jawan shakeer family
దేశసరిహద్దు లద్దాఖ్ వద్ద విధి నిర్వహణలో అసువులు బాసిన అమర జవాన్... షాకీర్ హుస్సేన్ కుటుంబాన్ని కుమురం భీం జిల్లా అదనపు ఎస్పీ సుధీంద్ర పరామర్శించారు. కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని కోరారు.
జవాన్ కుటుంబాన్ని పరామర్శించిన అదనపు ఎస్పీ
కరోనా కారణంగా అమరజవాన్ షాకీర్ హుస్సేన్... అంత్యక్రియలను లేహ్‌లో నిర్వహించారు. ఏఎస్పీ సుధీంద్ర... పట్టణంలోని జవాన్ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను కలుసుకున్నారు. ఘటన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని తెలిపారు. ఆయన వెంట కాగజ్‌నగర్ డీఎస్పీ స్వామి, పట్టణ ఎస్ఎచ్ఓ మోహన్, రూరల్ సీఐ అల్లం నరేందర్, ఎస్ఐలు ఉన్నారు.
ఇదీ చూడండి: లద్ధాఖ్‌లో కొండ చరియలు విరిగిపడి జవాన్ మృతి