తెలంగాణ

telangana

ETV Bharat / state

చర్యలు మరింత కట్టుదిట్టం

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్​ కొనసాగుతుండగా పలుచోట్ల ప్రజలు నిబంధనలు పాటించడం లేదు. కూరగాయల మార్కెట్​లో భౌతిక దూరం పాటించకుండా తిరుగుతున్నారు.

Actions are more committed in kagaznagar
చర్యలు మరింత కట్టుదిట్టం

By

Published : Apr 20, 2020, 11:26 AM IST

కుమురం భీం జిల్లాలో ఒకవైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంటే మరోవైపు ప్రజలు నిత్యావసరాల పేరుతో బయటకు రావడం అధికమౌతుంది. కాగజ్​నగర్ పట్టణంలో వివిధ ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్​ను ఏర్పాటు చేశారు. భౌతిక దూరం పాటించకుండా ప్రజలు మార్కెట్​ను సందర్శిస్తున్నారు.

పట్టణంలోని ప్రధాన వీధుల్లో ద్విచక్ర వాహనాలపై ఇద్దరిద్దరుగా వెళ్తున్న వారిని పోలీసులు ఆపుతున్నారు. మరోసారి ఇలా వస్తే వాహనాలు సీజ్ చేస్తామని చెబుతున్నారు. కాగజ్​నగర్ తహసీల్దార్ ప్రమోద్, ఎస్ఎచ్ఓ మోహన్ కట్టడి చర్యలను పర్యవేక్షించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చూడండి :గృహ హింస ఫిర్యాదులకు సంప్రదించండి

ABOUT THE AUTHOR

...view details