కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖిరిడి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మొహార్లే బాలాజీ ద్విచక్ర వాహనంపై జాతీయ రహదారిగుండా గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా లారీ డ్రైవర్ పారిపోయాడు.
లారీ ద్విచక్రవాహనం ఢీ.. ఒకరు మృతి - accident in kumurambheem district
కుమురంభీం జిల్లా వాంకిడి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడం వల్ల వాహనదారుడు అక్కడిక్కడే మృత్యవాతపడ్డాడు.
లారీ బైక్ ఢీ.. ఒకరు మృతి
మృతుడుకి మగ్గురు చిన్నారులు ఉండడం.. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు అయ్యి తానే కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తుండడం వల్ల కుటుంబ సభ్యులు ఈ వార్త విని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలాజీ మృతితో ఖిరిడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి:షాపింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం