కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం లక్ష్మీపూర్‌లో దారుణం జరిగింది. భర్తను కట్టుకున్న భార్యే ప్రాణం తీసింది. చిలాటిగుడకు చెందిన రూపకు 11 సంవత్సరాల క్రితం శంకర్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొంతకాలంగా శంకర్ తాగుడుకు బానిసై భార్యను రోజు మానసికంగా హింసించేవాడు. తట్టుకోలేని రూప పతిని చంపాలని నిర్ణయించుకుంది. శీతలపానీయంలో పురుగుల మందు కలిపి భర్తకు ఇచ్చింది. అది తాగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
హింసిస్తున్నాడని భర్తను చంపిన భార్య - wife
రోజూ తాగొచ్చి హింసించడం వల్ల తట్టుకోలేని భార్య భర్తను అంతమొందించిన ఘటన కుమురం భీం జిల్లా లక్ష్మీపూర్‌లో జరిగింది. శీతలపానీయంలో పురుగుల మందు కలిపి కట్టుకున్నవాడికి తాగించి కడతేర్చింది.

భర్తను చంపిన భార్య
హింసిస్తున్నాడని భర్తను చంపిన భార్య
ఇవీ చూడండి: అటవీ శాఖ మంత్రిని కలిసిన ఐకాస ప్రతినిధులు