తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కి... కుమురం భీం జిల్లా రైతు అరుదైన బహుమానం అందజేశాడు. తెలంగాణ నేలపై పండిన తొలితరం యాపిల్ పండ్లను బహుమతిగా ఇచ్చి... రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. తన వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన యాపిల్ పంట సాగులోని తొలి కోతను, ఓ యాపిల్ మొక్కను ముఖ్యమంత్రికి అందించాడు.
సీఎం కేసీఆర్‌కి రైతన్న బహుమానం - కుమురం భీం జిల్లా తాజా వార్తలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి... కుమురం భీం జిల్లా రైతు బాలాజీ అరుదైన బహుమానం అందజేశాడు. తెలంగాణ నేలపై పండించిన తొలి తరం యాపిల్ పండ్లను, ఓ మొక్కను సీఎంకి బహుమానంగా అందించి... రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్భంగా రైతు బాలాజీని కేసీఆర్ అభినందించి... తెలంగాణ నేలలు విభిన్న రకాల స్వభావం కలిగినవని చెప్పేందుకు ఈ యాపిల్ పండ్ల సాగే ఉదాహరణ అని తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లా ధనోరాకు చెందిన బాలాజీ... తన రెండెకరాల్లో హెచ్ఆర్-99 రకం యాపిల్ పంటను సాగు చేశాడు. పంట సాగులో ఉద్యానవన శాఖ ఎంతో సహకారాన్ని అందించిందని బాలాజీ తెలిపాడు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో యాపిల్ సాగుపై మరింత దృష్టి కేంద్రీకరించనున్నట్లు వివరించాడు ఈ యువ రైతు. ఈ సందర్భంగా రైతు బాలాజీని అభినందించిన కేసీఆర్... తెలంగాణ నేలలు విభిన్న రకాల స్వభావం కలిగినవని చెప్పేందుకు యాపిల్ పండ్ల సాగే ఉదాహరణ అని అన్నారు.
ఇదీ చూడండి :జయహో తెలంగాణ.. అమరులకు సీఎం నివాళులు