తెలంగాణ

telangana

ETV Bharat / state

వైకల్యాన్ని ఎదిరించి... సంకల్ప బలంతో జయించి

అనుకుంటే కానిది ఏమున్నది... మనిషి తలచుకుంటే చేయలేనిది ఏమున్నది... ఇలాంటి మాటలు వినడానికి, చదవడానికి బాగుంటాయి అనిపిస్తుంది. కానీ విధిరాతను తిరగరాసి... మనోబలంతో వైకల్యాన్ని ఎదిరించి... బతుకు బండిని నడిపిస్తున్న ఇతన్ని చూస్తుంటే ఆ మాటలు నిజమే.. అనిపించక తప్పదు. ఇంతకీ అతను ఎవరు? అసలు ఏమైందంటే...

వైకల్యాన్ని ఎదురించి... సంకల్ప బలంతో జయించి
వైకల్యాన్ని ఎదురించి... సంకల్ప బలంతో జయించి

By

Published : Aug 3, 2020, 6:49 AM IST

Updated : Aug 3, 2020, 7:00 AM IST

విధిరాతను సంకల్ప బలంతో జయించి ఆదర్శంగా నిలుస్తున్నాడో యువకుడు. కుమురం భీం జిల్లా కౌటాల మండలం గురుడుపేటకు చెందిన నికాడె విష్ణుమూర్తి డిగ్రీ వరకు చదివారు. నాలుగేళ్ల కిందట వరిధాన్యం కుప్పలను క్రషర్‌లో వేసే క్రమంలో ప్రమాదవశాత్తు రెండు కాళ్లు క్రషర్‌ చక్రాల్లో పడ్డాయి. మోకాళ్ల వరకు ఛిద్రమైపోయాయి.

ఆదుకున్న ఎమ్మెల్యే కోనప్ప

ఆయన పరిస్థితిని తెలుసుకున్న సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రత్యేక చొరవ తీసుకుని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించారు. జర్మన్‌ సాంకేతికతతో తయారైన రెండు కృత్రిమ కాళ్లను అమర్చేలా కృషి చేశారు. తనవంతు సాయం చేయడంతో పాటు ప్రభుత్వం నుంచీ సాయం అందేలా చర్యలు తీసుకున్నారు.

అడుగుతో మొదలై... ఉపాధి కోసం పరుగై

కృత్రిమ కాళ్లతో తిరిగి కొత్త జీవితం ప్రారంభించిన విష్ణుమూర్తి ఆదిలో ఆరు నెలలు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అరక పట్టడం మినహా అన్ని వ్యవసాయ పనులు సొంతంగా చేస్తున్నారు. ట్రాక్టర్‌నూ నడుపుతున్నారు.

ఇవీచూడండి:విషాదం మిగిల్చిన కరోనా.. దంపతుల ఆత్మహత్య

Last Updated : Aug 3, 2020, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details