PIL IN TS High court : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీ మండలం రాళ్లకన్నెపల్లి ప్రభుత్వ పాఠశాలను సర్పంచ్ గుణ్వంతరావు ఆక్రమించుకున్నారని గ్రామస్థులు ఆరోపించారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పాఠశాల భవనాల ఆక్రమణలను తొలగించేలా ఆదేశాలివ్వాలంటూ అదే గ్రామానికి చెందిన రైతు బల్వంతరావు పిల్ దాఖలు చేశారు.
PIL IN TS High court : 'స్కూల్‌ను సర్పంచ్ ఆక్రమించుకున్నారు.. చర్యలు తీసుకోండి' - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
PIL IN TS High court : స్కూల్‌ను సర్పంచ్ ఆక్రమించుకున్నారని.. చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ రైతు హైకోర్టును ఆశ్రయించారు. కుమురంభీం జిల్లా రాళ్లకన్నెపల్లికి చెందిన బల్వంతరావు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌కు చెప్పినా.. చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

సర్పంచ్‌పై భూమి ఆక్రమణ ఆరోపణలు
Telangana High Court News : గ్రామంలో పాఠశాల భవనాలను సర్పంచ్ తన నివాసాలుగా మార్చుకున్నారని.. రాజకీయ నేతలు, అధికారుల అండ చూసుకుని తననెవరూ ఏమీ చేయలేరని బహిరంగంగా ప్రకటిస్తున్నారని ఆరోపించారు. మూడు నెలలుగా చెబుతున్నా.. ఎవరూ చర్యలు తీసుకోవడం లేదన్నారు. కబ్జా అయిన భవనాలను ఖాళీ చేయించేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Teachers Transfers 2021 : టీచర్ల కేటాయింపు వివాదాస్పదం.. సీనియారిటీ జాబితా తప్పులతడక!