కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలో అటవీశాఖ రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దేవుడుపల్లి వాగు పక్కన గల అటవీ శాఖ భూమి కంపార్ట్మెంట్ 486 సర్వే నంబర్ 9 లో గల సుమారు 12 ఎకరాల భూమిలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న రైతులు ఆ భూమి తమదంటూ అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
భూమి విషయంలో అటవీశాఖ, రైతుల మధ్య వాగ్వాదం - dispute between forest department farmers
ఓ భూమిలో అటవీ శాఖ అధికారులు మెక్కలు నాటడంతో రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. భూమి తమదేనని రైతులు ఆందోళన చేశారు. పోలీసుల చొరవ చూపడంతో వారి మధ్య వాగ్వాదం సద్దుమణిగింది.
![భూమి విషయంలో అటవీశాఖ, రైతుల మధ్య వాగ్వాదం A dispute has erupted between forest department farmers in Sirpur U zone of Kumuram Bheem Asifabad district.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12173650-811-12173650-1623979701041.jpg)
సర్వే నంబర్ 9 పూర్తిగా అటవీ శాఖ పరిధిలో ఉండడంతో ఆ స్థలంలో మొక్కలు నాటామని డీఎఫ్ఆర్ఓ శశిధర్ బాబు తెలిపారు. ఆ భూమి అటవీ శాఖ పరిధిలోకి వస్తుందని రైతులకు అంతకుముందే తెలియచేశామన్నారు. రైతుల దగ్గర సరైన భూమి పత్రాలు లేకపోవడంతో మొక్కలు నాటడానికి సిద్ధమైనట్లు శశిధర్ బాబు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై విష్ణువర్ధన్‌కు తెలియజేయడంతో ఆయన ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. భూమికి సంబంధించిన పత్రాలు ఉంటే డీఎఫ్ఆర్ఓ నుంచి అనుమతి పత్రాలు తీసుకురావాలని ఎస్సై రైతులకు సూచించారు. అక్కడితో అటవీ శాఖ అధికారులకు రైతులకు వాగ్వాదం సద్దుమణిగింది.
ఇదీ చూడండి:ఈ రోజు మీ రాశిఫలం గురించి తెలుసుకోండి..