కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో కల్తీ పాలు విక్రయిస్తున్నాడని ఓ వినియోగదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టణంలోని సర్ సిల్క్ కాలనీకి చెందిన శ్రీనివాస్ కోసిని గ్రామానికి చెందిన కొత్రాంగి శ్యామ్ వద్ద పాలు తీసుకుంటారు. నిన్న తీసుకున్న పాలు ఫ్రిజ్లో పెట్టి బయటకు తీయగా దూది లాగా మారిందన్నారు.
విచారణ జరుపుతున్నామని పట్టణ ఎస్.ఎచ్.ఓ కిరణ్ తెలిపారు. పాలను స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించామని అన్నారు. నివేదిక వచ్చాక పూర్తి వివరాలు అందిస్తామని పేర్కొన్నారు.
'కల్తీ పాలు విక్రయిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు' - SAMPLES FOR LAB TEST
కల్తీ పాలు విక్రయించాడని ఓ వ్యక్తి అమ్మకపుదారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కుమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది.

పాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించాం : ఎస్.ఎచ్.ఓ
దూది లాగా మారిన కల్తీ పాలు
ఇవీ చూడండి : 'ఓటమి గెలుపునకు తొలిమెట్టు... బాధ్యతతో పనిచేస్తాం'