కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 30వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది రీజియన్లలోని 650 మంది క్రీడాకారులు 48 జట్లుగా పాల్గొంటున్నారు. ఈ రోజు జరిగిన పోటీల్లో అండర్-14 బాలుర విభాగంలో హైదరాబాద్- పూణే, బాలికల విభాగంలో చండీఘర్- షిల్లాంగ్, పూణే- హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. అండర్-17 బాలుర విభాగంలో లక్నో- చండీఘర్, బాలికల విభాగంలో భోపాల్- జైపూర్, చండీఘర్- పాట్నా జట్లు బరిలో నిలిచాయి. అండర్-19 బాలుర విభాగంలో హైదరాబాద్ - పూణే, భోపాల్- చండీఘర్, బాలికల విభాగంలో లక్నో- పూణే, జైపూర్- షిల్లాంగ్ జట్లు తలపడ్డాయి.
30వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం - 30th National Khokho competitions begin at kumurambheem district
కాగజ్నగర్ పట్టణంలోని నవోదయ విద్యాలయంలో 30వ జాతీయ స్థాయి ఖోఖో క్రీడలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న 48 జట్లు పాల్గొంటున్నాయి.
30వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం