తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇక స్థానిక పోరు... హోరాహోరీ - pracharam

ఖమ్మం జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఏనుకూరు మండలంలో అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి ఉషారాణి తన గుర్తు అయిన యాపిల్​ను ఓటర్లకు అందిస్తూ ఓట్లను అభ్యర్థించారు.

ఇక స్థానిక పోరు... హోరాహోరీ

By

Published : May 4, 2019, 12:00 PM IST

ఇక స్థానిక పోరు... హోరాహోరీ

ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉదయాన్నే గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఓటేయాలని కోరుతున్నారు. వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు వినూత్నంగా ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఏనుకూరులో స్వతంత్ర అభ్యర్థి ఉషారాణి తన గుర్తు అయిన యాపిల్​ను కూలీలకు అందిస్తూ ఓటు వేయాలని కోరారు. టీటీఎల్ పేటలో జడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థి భూక్య పద్మ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details