ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బందిని జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ సన్మానించారు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలోనూ వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు కమల్ రాజ్.
ఖమ్మంలో వైద్యులు, సిబ్బందికి సన్మానం - zp chairperson kamal raj latest news
ఆపద సమయంలో సేవలు అందిస్తున్న ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని సన్మానించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ వైద్యులు, సిబ్బందికి శాలువా కప్పి సత్కరించారు.
ఖమ్మంలో వైద్యులు, సిబ్బందికి సన్మానం
TAGGED:
kammam district latest news