పట్టణ ప్రగతే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం ముందుకు సాగుతుందని జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిర పురపాలక సంఘంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
'పట్టణ ప్రగతే తెరాస ప్రభుత్వ లక్ష్యం' - ఖమ్మం తాజా వార్త
ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రాధాన్యత క్రమంలో వాటిని పరిష్కరిస్తున్నామని జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్రాజు తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
'పట్టణ ప్రగతే తెరాస ప్రభుత్వ లక్ష్యం'
ప్రజలకు మౌలిక వసతులు మెరుగు పరచడం, వారి దీర్ఘకాలిక సమస్యలను తెలుసుకుని వాటిని ప్రాధాన్యత క్రమం ప్రకారం తీర్చడం జరిగిందని తెలిపారు. రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు స్వచ్ఛందంగా తమ నివాస ప్రాంతాల వద్ద మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి సూచించారు.
ఇవీ చూడండి:విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా