తెలంగాణ

telangana

ETV Bharat / state

మధిరలో చేప పిల్లలను విడుదల చేసిన జడ్పీ ఛైర్మన్​ - fish release at pedda cheruvu in madira

ఖమ్మం జిల్లా మధిరలోని పెద్ద చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జడ్పీ ఛైర్మన్​ లింగాల కమల్​రాజు హాజరై.. చేప పిల్లలను విడుదల చేశారు.

zp chairman kamal raju released fish in madira
మధిరలో చేప పిల్లలను విడుదల చేసిన జడ్పీ ఛైర్మన్​

By

Published : Sep 21, 2020, 9:51 PM IST

మత్స్య కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్​రాజు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిరలోని పెద్ద చెరువులో సుమారు 1.5 లక్షల చేప పిల్లలను ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం చేప పిల్లలను ఉచితంగా అందించి మత్స్య కార్మికుల ఉపాధికి చేయూత అందిస్తోందని కమల్​రాజు తెలిపారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి శివప్రసాద్, పురపాలక ఛైర్​పర్సన్ లత, వైస్ ఛైర్​పర్సన్ విద్యాలత, ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగిశెట్టి కోటేశ్వర రావు, సొసైటీ ఛైర్మన్ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి.. నగరవాసులకు కాంగ్రెస్ శ్రేణులు అండగా ఉండాలి: రేవంత్

ABOUT THE AUTHOR

...view details