ఖమ్మం జిల్లా ఖానాపురం మండలం హవేలి పారిశ్రామిక ప్రాంతంలో స్థానికంగా నివాసముంటున్న ఖాదర్ పాష బూడిద గుంటలో పడి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. మృతుడి బంధువుల రోదనలు స్థానికులను సైతం కంటతడి పెట్టించాయి.
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి - youngman-suspected-death
గ్రానైట్ ఫ్యాక్టరీ బూడిద గుంటలో పడి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఖానాపురంలో చోటు చేసింది.
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి