తెలంగాణ

telangana

ETV Bharat / state

రోజూ వెయ్యి మంది ఆకలి తీరుస్తున్న సామాన్య యువకుడు - 1000 మంది ఆకలి తీరుస్తున్న యువకుడు

తాను చేసేది చిన్న ఉద్యోగం. అయితేనేం గొప్ప మనసు అతని సొంతం. తాను దాచుకున్న డబ్బును పేదల కడుపు నింపడానికి వినియోగించాడు. లాక్​డౌన్​లో పేదల ఆకలి తీరుస్తూ.. ప్రజల మన్ననలను పొందుతున్నాడు.

రోజు వెయ్యి మంది ఆకలి తీరుస్తున్న యువకుడు
రోజు వెయ్యి మంది ఆకలి తీరుస్తున్న యువకుడు

By

Published : Apr 10, 2020, 3:33 PM IST

స్పందించే హృదయం ఉండాలే కానీ ఎలాగైనా... సాయం చేయవచ్చని నిరూపిస్తున్నాడు ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు. లాక్​డౌన్ నేపథ్యంలో రోజు 1,000 మంది ఆకలి తీరుస్తూ... ముందుకు సాగుతున్నాడు. ఖమ్మం నగరంలో పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇది గమనించిన ఉపేందర్‌ తాను దాచుకున్న రూ. 46వేలతో కొందరికైనా... కడుపు నింపాలనుకున్నాడు. ఐదుగురు స్నేహితుల సాయంతో రోజూ... భోజనం సిద్ధం చేసి.. పేదల కడుపు నింపుతున్నాడు. 8రోజులుగా పలు కాలనీల్లో అన్నదానం చేస్తున్నాడు. యువకుడిని చూసి కొంత మంది దాతలు ముందుకు వచ్చారు. వారి సాయంతో లాక్​డౌన్‌ అమలయ్యేంత వరకు పేదలకు ఆహారం అందిస్తానని ఉపేందర్‌ చెబుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details