ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాజేశ్వరపురం గ్రామానికి చెందిన మునుగంటి లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తమకున్న భూమికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వటం లేదని... కార్యాలయం చుట్టూ సంవత్సరం నుంచి తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుటే పురుగుల మందు తాగాడు.
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం - ఖమ్మం జిల్లా వార్తలు
తమ భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడం లేదని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జరిగింది.
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం
ఆయనను సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల నేలకొండపల్లి నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ ద్వారా తరలించారు.
ఇవీ చూడండి: మద్యం మత్తులో కన్న కొడుకునే అమ్మేసిన కసాయి తల్లి!