తెలంగాణ

telangana

ETV Bharat / state

చెరువులో మునిగి యువకుడు మృతి - young man death by drowning in lake

దుర్గమాత నిమజ్జనం కోసం వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా దెందుకూరులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

బాలు

By

Published : Oct 10, 2019, 3:17 PM IST

ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరుకు చెందిన బాలు చెరువులో మునిగి మృతి చెందాడు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించారు. అనంతరం నిమజ్జనం చేసేందుకు సమీపంలో ఉన్న మధిర అంబర్పేట పెద్ద చెరువు వద్దకు తీసుకువచ్చారు. అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో బాలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

చెరువులో మునిగి యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details