ఖమ్మం జిల్లా ఏన్కూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ యువరైతు క్రిమి సంహారక పొడి నోట్లో పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నరసింహారావుపేటకు చెందిన తన తండ్రి సుంకర రామయ్యకు చెందిన 3 ఎకరాల వ్యవసాయ భూమిని కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని అతడి కుమారుడు సురేశ్ ఆరోపించారు. రెవెన్యూ అధికారులు తమ భూములను అక్రమంగా వేరే వారికి పట్టా చేశారని తెలిపారు. ఇదేంటని అడిగితే ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. తమపై ఆక్రమణదారులు దాడికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిమి సంహారక మందును మింగిన యువరైతును పోలీసులు అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు.
ఖమ్మంలో యువరైతు ఆత్మహత్యాయత్నం - Young Farmer suicide in Khammam
ఖమ్మం జిల్లా ఏన్కూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ యువరైతు ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. తన తండ్రికి చెందిన 3ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తులకు అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ సురేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడాడు.
ఖమ్మంలో యువరైతు ఆత్మహత్యాయత్నం