తెలంగాణ

telangana

ETV Bharat / state

కూసుమంచిలో విషాదం.. కరోనా కాటుకు యువ దంపతుల బలి - కొవిడ్​ దెబ్బకు యువ దంపతులు బలి

కరోనా మహమ్మారి కుటుంబాలను అల్లకల్లోలం చేస్తోంది. చూడ చక్కగా ఉన్న యువ దంపతులను చూసి కరోనాకు కన్ను కుట్టిందేమో వారి ప్రాణాలు తీసింది. వైరస్ బారిన పడి ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన యువ దంపతులు మృతి చెందారు. కొవిడ్ దెబ్బకు మొన్న భార్య ప్రాణాలు కోల్పోగా.. ఈ రోజు భర్త కన్నుమూశారు.

khammam district
కూసుమంచికి చెందిన యువ దంపతులు మృతి

By

Published : May 23, 2021, 10:17 PM IST

Updated : May 24, 2021, 9:29 AM IST

ఖమ్మం జిల్లా కూసుమంచిలో విషాదం చోటు చేసుకుంది. మూడు రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ కరోనా బారిన పడి మరణించారు. కూసుమంచికి చెందిన శైలజ, రాము దంపతులు మహమ్మారి పంజాకు ప్రాణాలొదిలారు. రెండు రోజుల క్రితమే భర్త మృతి చెందగా.. ఈరోజు భార్య శైలజ మృత్యువాత పడ్డారు.

తల్లిదండ్రులను చూసేందుకు వెళ్లి..

కూసుమంచికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి కందుల వెంకటేశ్వర్లు, భార్య డేవిడ్​ మణి కొవిడ్ బారిన పడి కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తన తల్లిదండ్రులను చూసేందుకు భర్త దామళ్ల రాము(34)తో కలిసి దామళ్ల శైలజ.. ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలోనే వీరిద్దరికి వైరస్ సోకింది. కరోనా కాటుకు మొన్న భార్య ప్రాణాలు కోల్పొగా.. ఈరోజు ఆమె భర్త రాము ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదిలా ఉండగా రాము హైదరాబాద్​లో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పనిచేస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో భార్య, భర్తలిద్దరూ మరణించడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

ఇదీ చూడండి: ఉదయం నుంచి దుకాణాల వద్ద కిటకిట.. 10 తర్వాత స్తబ్ధత

Last Updated : May 24, 2021, 9:29 AM IST

ABOUT THE AUTHOR

...view details