క్రిస్టమస్ వేడుకలను పురస్కరించుకుని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పేద క్రైస్తవులకు బట్టల పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు సీఈఆర్ క్లబ్‌లో జరిగిన క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.. తెరాస ప్రభుత్వం వివిధ వర్గాల కులాల మతాల వారికి అనుగుణంగా పండగలలో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
పేద క్రైస్తవులకు బట్టల పంపిణీ - క్రిస్మస్ శుభాకాంక్షలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సీఈఆర్ క్లబ్‌లో క్రిస్టమస్ వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఈ ఉత్సవాలలో పాల్గొని, క్రైస్తవులకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు.

పేద క్రైస్తవులకు బట్టల పంపిణీ
క్రైస్తవులకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.