తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ సొమ్ము చోరి... వీఆర్ఏపై అనుమానం - police case

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖర్చులకు మంజూరైన డబ్బులు మాయమైన ఘటన ఖమ్మం జిల్లా వైరాలో చోటుచేసుకుంది. ఏప్రిల్ 27న సొమ్ము అపహరణకు గురికాగా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తహసీల్దార్ కార్యాలయంలో చోరీ

By

Published : May 7, 2019, 10:32 AM IST

ఖమ్మం జిల్లా వైరా తహసీల్దార్ కార్యాలయంలో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖర్చుల కోసం మంజూరైన 2.63 లక్షలు బీరువాలో భద్ర పరచగా అవి దొంగతనానికి గురయ్యాయి. ఏప్రిల్ 27న తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ కోటేశ్వరరావు సాయంతో నగదును బీరువాలో ఉంచి అధికారులు సీల్ వేశారు. అదే రోజు రాత్రి కోటేశ్వరరావు కార్యాలయం నుంచి పరుగులు తీయడం కాపలాదారుడు గుర్తించాడు. అప్పటి నుంచి కార్యాలయంలో విచారణ చేస్తున్న అధికారులు ఈనెల 6న పోలీసులను ఆశ్రయించారు. తాళాలు పగలగొట్టి ఆ నగదును వీఆర్ఏ కాజేసినట్లు అనుమానం వ్యక్తపరచగా ఆ కోణంలోనే దర్యాప్తు ప్రారంభించారు. సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

తహసీల్దార్ కార్యాలయంలో చోరీ

ABOUT THE AUTHOR

...view details