గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటి పూడిలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు.
'గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించండి'
ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ పర్యటించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు.
వైరా ఎమ్మెల్యే రాములు నాయక్
ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారని వివరించారు. అందులో భాగంగానే పల్లె ప్రగతి కార్యక్రమానికి అత్యధిక నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. గ్రామాల అభివృద్ధికి స్వచ్ఛత పాటించే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: టీకా తీసుకుంటే మహిళలకు ముక్కుపుడక ఫ్రీ!