తెలంగాణ

telangana

ETV Bharat / state

కలవరపెడుతోన్న కరోనా.. ఎమ్మెల్యే రాములు నాయక్​కు పాజిటివ్.. - ఎమ్మెల్యే రాములు నాయక్ తాజా వార్తలు

Mla ramulu nayak: రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కరోనా బారినపడ్డారు. ఇటీవల తనను కలినవారు పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

రాములు నాయక్
రాములు నాయక్

By

Published : Jul 9, 2022, 3:58 PM IST

Mla ramulu nayak: రాష్ట్రంలో కరోనా మళ్లీ కలవరపెడుతోంది. కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కొవిడ్ బారిన పడ్డారు. జలుబు, జ్వరం రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా తెలియచేశారు.

ఈ నేపథ్యంలో.. ఇంట్లోనే క్వారంటైన్​లో ఉన్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. గత మూడు, నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని.. జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే రాములు నాయక్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details