ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 42 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు. ఈ పథకం పేదల పాలిట వరంలాంటిదని ఆయన వెల్లడించారు.
'పేదల పాలిట వరం కల్యాణలక్ష్మి పథకం' - కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ తాజావార్తలు
రాష్ట్రంలోని పేదలు తమ పిల్లల పెళ్లిళ్లు చేయడంలో ఇబ్బంది పడొద్దనే భావనతోనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని 42మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు.

పేదల పాలిట వరం కల్యాణలక్ష్మి పథకం
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాలోతు శకుంతల, జడ్పీటీసీ జగన్, రైతు సమన్వయ సమితి సభ్యులు సత్యనారాయణ, రమేశ్ వివిధ పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.